

కామెడీ కింగ్ అల్లరి నరేష్ తన వింటేజ్ కామెడీతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు ‘రంభ ఊర్వశి మేనక’ చిత్రంతో సిద్ధమయ్యాడు. మోహన్ చింతాడ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్‌లతో పాటు వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం కృష్ణాష్టమి సందర్భంగా సెప్టెంబర్ 4న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో అక్కినేని నాగచైతన్య కూడా భాగమై, అల్లరి నరేష్‌తో కలిసి సందడి చేశాడు.
ప్రమోషనల్ వీడియోలో అల్లరి నరేష్ ఓ మాయా పుస్తకంపై ‘రంభాయ నమః, ఊర్వశాయ నమః, మేనకాయ నమః, అన్నపూర్ణ స్టూడియోసాయ నమః, కింగ్ నాగార్జునాయ నమః, నాగచైతన్యాయ నమః’ అంటూ రాస్తుంటాడు. ఇంతలో నాగచైతన్య వచ్చి.. ‘ఏంటీ నరేష్, తెగ కష్టపడిపోతున్నావు.. నా మీద చేతబడి చేస్తున్నావా?’ అంటూ సరదాగా ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య ఫన్నీ సంభాషణ చోటుచేసుకుంది. అనంతరం సెప్టెంబర్ 4న సినిమా విడుదల కానుందని ప్రకటిస్తూ, ప్రేక్షకులను నవ్వుల విందు కోసం థియేటర్లకు రావాలని కోరారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!