

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాకా సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు అభిమానుల్లో ఆసక్తిని పెంచగా, సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మరోవైపు, అల్లు అర్జున్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఆయన భార్య స్నేహారెడ్డి తండ్రి, వ్యాపారవేత్త కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అల్లు అర్జున్‌కు స్నేహారెడ్డితో ఓ పెళ్లి వేడుకలో పరిచయం ఏర్పడిందని వెల్లడించారు. స్నేహారెడ్డి న్యూయార్క్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌లో ఎంఎస్ పూర్తి చేశారని, తన పెద్ద కుమార్తె లండన్‌లో ఎంఎస్ చదివారని తెలిపారు. తన కుమార్తెలకు ఇప్పటివరకు వ్యాపార బాధ్యతలు అప్పగించలేదని కూడా ఆయన స్పష్టం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!