

విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘లీసా’. ఓం సాయిరామ్ ఆర్ట్స్, ఐరాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై వెంకట్ దుగ్గిరెడ్డి, రామకృష్ణ ఐల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో జవహర్ పవార్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు రాని విధంగా రెండు భిన్నమైన జోనర్లను సరికొత్త పద్ధతిలో మేళవిస్తూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ‘ఎస్సార్ కళ్యాణమండపం’ దర్శకుడు శ్రీధర్ గాదె ఎడిటర్‌గా పనిచేస్తుండగా, మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
ఇటీవలే ‘లీసా’ షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని మేకర్స్ తెలిపారు. చూసిన రషెస్ అందరినీ ఆకట్టుకున్నాయని, సినిమా అవుట్‌పుట్‌పై చిత్ర బృందం ఎంతో నమ్మకంగా ఉందని వెల్లడించారు. సినిమా మేకింగ్‌తో పాటు అనన్య నాగళ్ల నటన ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని పేర్కొన్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి నవంబర్‌లో సినిమాను ఘనంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!