

అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న వినూత్న చిత్రం 'పళ్ళబురుసు'ను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు చిత్రాన్ని 2026 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. తెలుగు సంస్కృతి, ప్రాంతీయతను ప్రతిబింబించే ఈ వినోదాత్మక కామెడీ-డ్రామాలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తండ్రీకొడుకులుగా ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, ప్రజ్వల్, గోమతి రెడ్డి, కిరణ్ మాచా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఫస్ట్ లుక్ పోస్టర్‌లో జిల్లా కోర్టు ఆవరణలో భారీ టూత్‌బ్రష్‌ను త్రాసులా రూపొందించి, దానిపై వెన్ను వెన్నుకు ఆనుకుని కూర్చున్న ఇద్దరు ప్రధాన పాత్రధారులను చూపించిన తీరు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రానికి ఉదయ్ చౌహాన్ కథ, దర్శకత్వం వహిస్తుండగా, వినోద్ కె. బంగారి సినిమాటోగ్రఫీ, పవన్ సిహెచ్ సంగీతం అందిస్తున్నారు. క్షితిజ్ జీవన్ రణధీర్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. వినూత్న కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి త్వరలో మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!