

నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ నుంచి విడుదలైన ‘యేష నాగుల కట్ట’ పాట ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పక్కా జానపద మాస్ బీట్‌తో రూపొందిన ఈ పాటకు మంచి స్పందన లభిస్తోంది. అయితే లిరికల్ వీడియోలో ఆట సందీప్ కొరియోగ్రఫీపై కొంత మిశ్రమ స్పందన వచ్చింది. నాని, కీర్తి సురేష్ ఎనర్జీకి తగ్గట్టుగా మరింత హై-వోల్టేజ్ డాన్స్ మూమెంట్స్ ఉండాల్సిందని కొందరు అభిమానులు అభిప్రాయపడ్డారు. మాస్ పాట కావడంతో తెరపై మరింత భారీ స్థాయిలో డాన్స్ చూడాలని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆట సందీప్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని పెంచుతున్నాయి. లిరికల్ వీడియోలో అసలైన ఊరమాస్ డాన్స్ మూమెంట్స్‌ను చూపించలేదని ఆయన వెల్లడించారు. సినిమాలో ప్రేక్షకులకు మరిన్ని సర్ప్రైజ్‌లు ఉంటాయని చెప్పడంతో థియేట్రికల్ వర్షన్‌పై క్యూరియాసిటీ పెరిగింది. ఉద్దేశపూర్వకంగానే కొన్ని కీలకమైన డాన్స్ మూమెంట్స్‌ను లిరికల్ వీడియోలో దాచిపెట్టినట్లు ఆట సందీప్ స్పష్టం చేశారు. దీంతో ఈ నెల 24న ‘ది ప్యారడైజ్’ విడుదలైనప్పుడు ‘యేష నాగుల కట్ట’ పాట తెరపై ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. నాని, కీర్తి సురేష్ మాస్ ఎనర్జీకి ఆట సందీప్ కొరియోగ్రఫీ తోడైతే పాట మరింత ఆకట్టుకునే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!