

'తబాహీ' పాటతో రికార్డు స్థాయి విజయాన్ని అందుకున్న టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ చిత్ర బృందం ఇప్పుడు రెండో రొమాంటిక్ మెలోడీ 'మనసాగదే'ను విడుదల చేసింది. మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, కేవీఎన్ ప్రొడక్షన్స్, జీ మ్యూజిక్ కంపెనీ సంయుక్తంగా విడుదల చేసిన ఈ పాట ప్రేమలోని చెప్పలేని భావాలు, తీరని తపన, మౌనంగా మిగిలిపోయిన అనుబంధాన్ని హృద్యంగా ఆవిష్కరిస్తుంది. 'తబాహీ' ప్రేమలోని ఉత్సాహాన్ని చూపిస్తే, 'మనసాగదే' ప్రేమలోని భావోద్వేగాల లోతును ఆవిష్కరిస్తుంది.
ఈ పాటలో యష్ పోషించిన రాయా, తారా సుతారియా నటించిన రెబెకా పాత్రల మధ్య బంధాన్ని మరింత భావోద్వేగంగా చూపించారు. తనిష్క్ బాగ్చి, అర్స్లాన్ నిజామీ, ఫహీమ్ అబ్దుల్లా స్వరపరిచిన ఈ మెలోడీకి సిద్ధార్థ్ బస్రూర్ తన గాత్రంతో ప్రత్యేకమైన భావాన్ని అందించగా, తెలుగు సాహిత్యాన్ని రామజోగయ్య శాస్త్రి రచించారు. యష్, గీతు మోహన్‌దాస్ కలిసి కథను రూపొందించగా, గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ బహుభాషా చిత్రం 2026 ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!