

బ్లాక్‌బస్టర్ ‘వీరసింహారెడ్డి’ తర్వాత నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని రెండోసారి కలిసి పనిచేస్తున్నారు. వీరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా కమర్షియల్ ఎంటర్‌టైనర్ టీజర్ ఈరోజు విడుదలైంది. టీజర్‌లో సినిమా టైటిల్‌ను రివీల్ చేయడంతో పాటు బాలకృష్ణను ‘దాదా’గా పరిచయం చేశారు. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్యను స్టైలిష్ మాస్ యాక్షన్ హీరోగా ప్రజెంట్ చేశారు. ముఖ్యంగా బాలకృష్ణ స్వాగ్, స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటున్నాయి. సాల్ట్ అండ్ పెప్పర్ గడ్డంతో బాలయ్య లుక్ మరింత స్టైలిష్‌గా కనిపిస్తోంది.
టీజర్‌లో ‘నాకు గురి పెట్టడానికి.. ఒంట్లో పొగరు, వేలికి ట్రిగ్గర్ ఉంటే సరిపోదు.. బుల్లెట్లకు బలుపు ఉండాలి, గన్స్‌కు గట్స్ ఉండాలి’ అంటూ బాలకృష్ణ చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్ మాస్ అంశాలను హైలైట్ చేస్తోంది. మంచు మనోజ్, కాజల్ అగర్వాల్, సముద్రఖని, శరత్‌కుమార్, అభిమన్యు సింగ్, ఉపేంద్ర లిమాయే, మనీష్ వాధ్వా, స్వాసిక ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అరవింద్ ఎస్. కశ్యప్ సినిమాటోగ్రఫీ అందించగా, థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు మరింత బలాన్ని ఇచ్చింది. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించిన ఈ చిత్రాన్ని వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. సినిమా డిసెంబర్ 24న థియేటర్లలోకి రానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!