

టాలీవుడ్లో మరోసారి సోషల్ మీడియా వేదికగా వివాదం చెలరేగింది. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ నటుడు ప్రకాశ్ రాజ్ వ్యంగ్యంగా స్పందించారు. తెలంగాణలో జనసేన పోటీ అంశంపై ప్రశ్నలు లేవనెత్తుతూ ఆయన సోషల్ మీడియాలో చేసిన పోస్టు రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఈ పోస్టుకు నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ప్రతి అంశంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తూ ప్రకాశ్ రాజ్‌పై విమర్శలు గుప్పించారు. ఇద్దరి మధ్య జరిగిన ఈ మాటల యుద్ధం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అభిమానులు, రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. హైదరాబాద్‌లో సభకు అనుమతి నిరాకరణ అనంతరం తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన నేపథ్యంలో ఈ వివాదం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!