

నటి కీర్తి సురేష్ త్వరలో క్రైమ్ డ్రామా, మహిళా గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో రూపొందిన ‘అక్క’ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇందులో ఆమె ఇప్పటివరకు పోషించని విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ధర్మరాజ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ను వైఆర్ఎఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. ఇందులో కీర్తి సురేష్ భవానిగా, రాధికా ఆప్టే రుద్రగా నటిస్తున్నారు. తన్వీ ఆజ్మీ, విశాఖ్ నాయర్, మహేశ్ మంజ్రేకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సిరీస్ ప్రచారంలో భాగంగా చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటుండగా, కీర్తి తన పాత్రకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
భవాని పాత్ర తన కెరీర్‌లో అత్యంత ప్రత్యేకమైన, గుర్తుండిపోయే పాత్రల్లో ఒకటని కీర్తి సురేష్ తెలిపారు. రాధికా ఆప్టేతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని, తమ పాత్రల మధ్య ఉండే సంబంధం కథలో ఉత్కంఠను మరింత పెంచుతుందని చెప్పారు. ‘అక్క’ ద్వారా తొలిసారిగా నెట్‌ఫ్లిక్స్, వైఆర్ఎఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలతో కలిసి వెబ్ సిరీస్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కథలోని ప్రత్యేకతే తనను ప్రాజెక్ట్ వైపు ఆకర్షించిందని పేర్కొన్నారు. కథ ముందుకు సాగుతున్న కొద్దీ భవాని పాత్రలోని విభిన్న కోణాలను ప్రేక్షకులు ఆస్వాదిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సిరీస్ అక్టోబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!