

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ప్యారడైజ్’ ప్రస్తుతం చివరి దశ షూటింగ్‌లో ఉంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మమిత బైజు హీరోయిన్‌గా నటిస్తుండగా, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టు 21న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించినప్పటికీ, ఆ తేదీన విడుదల కావడం కాస్త కష్టమేననే వార్తలు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇప్పటికే చిత్రీకరణలో 70 నుంచి 80 శాతం వరకు పూర్తి అయినట్లు సమాచారం.
క్లైమాక్స్‌తో పాటు కొన్ని పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉండగా, వాటిని త్వరగా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వేగవంతం చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఈ సినిమాలో మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో నటిస్తుండగా, అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్‌లు, ప్రచార కంటెంట్ దేశవ్యాప్తంగా సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. దీంతో ‘ది ప్యారడైజ్’ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!