8, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్‌కు బిగ్ షాక్?

Writer: Shivani K 09:27 AM, 31 ఆగస్టు, 2026
‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్‌కు బిగ్ షాక్?

ఇండియన్ సినిమా మార్కెట్ ఇప్పుడు పాన్ వరల్డ్ స్థాయికి విస్తరిస్తోంది. దర్శకుడు రాజమౌళి చూపించిన మార్గంలో మరింత ముందుకు వెళ్లే ప్రయత్నాల్లో భాగంగా ‘టాక్సిక్’ సినిమాను కన్నడతో పాటు ఇంగ్లీష్‌లోనూ తెరకెక్కించారు. శాండిల్ వుడ్ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని రెండు భాషల్లో ఒకేసారి రూపొందించారు. అంతేకాకుండా హాలీవుడ్ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ లయన్స్ గేట్ ద్వారా అక్కడ కూడా విడుదల చేశారు. థియేటర్లలో విడుదలైన తర్వాత ఈ సినిమా హాలీవుడ్‌లో ఎలాంటి ప్రభావం చూపిందనే విషయంపై పెద్దగా సమాచారం బయటకు రాలేదు. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే 150 కోట్ల వసూళ్లు సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ప్రధానంగా హిందీ, తెలుగు, కన్నడ మార్కెట్ల నుంచే మంచి స్పందన వచ్చినట్లు తెలుస్తోంది.

ఇంగ్లీష్‌లో నేరుగా రూపొందించిన ‘టాక్సిక్’కు హాలీవుడ్ మార్కెట్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కలేదనే ప్రచారం ఇప్పుడు వినిపిస్తోంది. ముఖ్యంగా ఇంగ్లీష్ వెర్షన్‌కు 1 మిలియన్ డాలర్ గ్రాస్ కూడా రాలేదని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో హాలీవుడ్ కోసం మేకర్స్ చేసిన ప్రయత్నం ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇండియన్ సినిమా నుంచి ఇలాంటి ప్రయోగం చేయడం మాత్రం ప్రత్యేకమైన విషయంగానే చెప్పాలి. థియేటర్లలో పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, ఓటీటీ విడుదల తర్వాత ‘టాక్సిక్’కు అంతర్జాతీయ ప్రేక్షకుల్లో మరింత రీచ్ వస్తుందా అనే ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా యష్ క్రేజ్ ఓటీటీ మార్కెట్‌లో సినిమాకు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ఎపిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా సందీప్

‘ఎపిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా సందీప్

ఎయిర్‌పోర్ట్‌లో నటి అవికా గోర్‌కు వింత అనుభవం...

ఎయిర్‌పోర్ట్‌లో నటి అవికా గోర్‌కు వింత అనుభవం...

‘పంచనామా’తో నిర్మాతగా మారిన ఉదయభాను

‘పంచనామా’తో నిర్మాతగా మారిన ఉదయభాను

మంచు మనోజ్ మూవీపై ఆసక్తికర అప్‌డేట్

మంచు మనోజ్ మూవీపై ఆసక్తికర అప్‌డేట్

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’

యశ్‌ రావణుడి విశ్వరూపం.. ‘రామాయణ’లో భారీ స్క్రీన్‌ టైమ్‌!

యశ్‌ రావణుడి విశ్వరూపం.. ‘రామాయణ’లో భారీ స్క్రీన్‌ టైమ్‌!

ట్యాగ్లు
యష్టాక్సిక్హాలీవుడ్లయన్స్‌గేట్కన్నడ సినిమాపాన్ వరల్డ్ సినిమాఇండియన్ సినిమాఓటీటీబాక్సాఫీస్సందీప్ రెడ్డి వంగా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భార్య మెయింటెనెన్స్ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు
జనరల్

భార్య మెయింటెనెన్స్ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు

ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులు, వాణిజ్యాన్ని పెంచాలని తెలంగాణ ప్రయత్నం – ఉత్తమ్
జనరల్

ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులు, వాణిజ్యాన్ని పెంచాలని తెలంగాణ ప్రయత్నం – ఉత్తమ్

చైనా డ్యాన్సర్‌తో మళ్లీ ట్రెండ్ అవుతున్న ‘పౌర్ణమి’ పాట
జనరల్

చైనా డ్యాన్సర్‌తో మళ్లీ ట్రెండ్ అవుతున్న ‘పౌర్ణమి’ పాట

భారత్‌-అఫ్గాన్‌ టీ20 సిరీస్‌కు రంగం సిద్ధం
క్రీడలు

భారత్‌-అఫ్గాన్‌ టీ20 సిరీస్‌కు రంగం సిద్ధం

పశ్చిమాసియా ఉద్రిక్తతలతో స్టాక్ మార్కెట్లు డౌన్
బిజినెస్

పశ్చిమాసియా ఉద్రిక్తతలతో స్టాక్ మార్కెట్లు డౌన్

బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్‌ను సద్వినియోగం చేసుకోండి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
జనరల్

బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్‌ను సద్వినియోగం చేసుకోండి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

అసెంబ్లీ తీరుపై బండి సంజయ్ తీవ్ర విమర్శలు
రాజకీయాలు

అసెంబ్లీ తీరుపై బండి సంజయ్ తీవ్ర విమర్శలు

ఇస్రో ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు - ఛైర్మన్ నారాయణన్
జనరల్

ఇస్రో ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు - ఛైర్మన్ నారాయణన్

సౌదీ అరేబియాపై హౌతీల దాడులతో ఉద్రిక్తత
జనరల్

సౌదీ అరేబియాపై హౌతీల దాడులతో ఉద్రిక్తత

అసెంబ్లీ ఘటనలో గాయపడిన మహిళా పోలీసులను పరామర్శించిన సీతక్క
జనరల్

అసెంబ్లీ ఘటనలో గాయపడిన మహిళా పోలీసులను పరామర్శించిన సీతక్క

డీఆర్‌ఎస్‌లో వైభవ్ సూర్యవంశీ అదుర్స్
క్రీడలు

డీఆర్‌ఎస్‌లో వైభవ్ సూర్యవంశీ అదుర్స్

‘ఎపిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా సందీప్
సినిమాలు

‘ఎపిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా సందీప్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!