
జనరల్

కుంభమేళా వైరల్ గర్ల్‌గా గుర్తింపు పొందిన మోనాలిసా కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మోనాలిసాను మేజర్‌గా పరిగణించవచ్చని పేర్కొంటూ, ఆమె భర్త మహమ్మద్ ఫర్మాన్‌కు కేరళ హైకోర్టు నెల రోజుల ట్రాన్సిట్ బెయిల్ మంజూరు చేసింది. మోనాలిసా తల్లిదండ్రులు ఆమె మైనర్ అని ఆరోపిస్తూ, ఫర్మాన్‌పై కిడ్నాప్ మరియు పోక్సో కేసులు నమోదు చేయించారు.
కేసు విచారణ సందర్భంగా సమర్పించిన బర్త్ సర్టిఫికెట్, ఓటర్ కార్డు, బ్యాంక్ పాస్బుక్‌ల ఆధారంగా యువతి పుట్టిన తేదీ 2008 జనవరి 1గా నమోదైందని కోర్టు గుర్తించింది. ఈ ఆధారాల ప్రకారం ఆమెను మేజర్‌గా భావించవచ్చని అభిప్రాయపడింది. బర్త్ సర్టిఫికెట్ నకిలీదని పోలీసులు వాదించినప్పటికీ, కోర్టు ఆ వాదనను తోసిపుచ్చి ఫర్మాన్‌కు తాత్కాలిక ఊరట కల్పించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!