

ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మోకాలి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైంది. సినిమా షూటింగ్‌లో యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా గాయపడిన ఆయనకు నిపుణులైన వైద్యుల బృందం శస్త్రచికిత్స నిర్వహించింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండగా, పూర్తిగా కోలుకోవడానికి నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
ఈ నేపథ్యంలో బాలకృష్ణ కుమార్తె నారా బ్రహ్మణి సోషల్ మీడియా ద్వారా ఆయన ఆరోగ్యంపై అధికారిక సమాచారం పంచుకున్నారు. శస్త్రచికిత్స విజయవంతమైందని, బాలకృష్ణ వేగంగా కోలుకుంటూ మునుపటి ఉత్సాహాన్ని తిరిగి పొందుతున్నారని ఆమె తెలిపారు. తమ కుటుంబానికి అండగా నిలిచిన అభిమానులు, శ్రేయోభిలాషులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మరో మూడు నుంచి నాలుగు రోజుల్లో బాలకృష్ణ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉండగా, పూర్తిగా కోలుకున్న అనంతరం ఎన్‌బికె111 సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!