

బాక్సాఫీస్ వద్ద ‘టాక్సిక్’ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా రాకింగ్ స్టార్ యష్ పాన్-ఇండియా స్టార్‌డమ్ మాత్రం చెక్కుచెదరలేదని ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ‘కేజీఎఫ్’ ఫ్రాంచైజీతో దేశవ్యాప్తంగా సంపాదించుకున్న గుర్తింపు కారణంగా ‘టాక్సిక్’కు భారీ ఓపెనింగ్స్ లభించాయి. ఈ వసూళ్లు యష్‌కు ఉన్న థియేట్రికల్ స్టామినాను మరోసారి చూపించాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం యష్ ఇమేజ్‌ను పూర్తిస్థాయిలో ఉపయోగించుకునే బలమైన కథ, దర్శకుడు అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో యష్‌ను పాన్-ఇండియా స్థాయి నుంచి మరింత గ్లోబల్ రేంజ్‌కు తీసుకెళ్లిన దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో మళ్లీ జతకట్టడం మంచి ఆప్షన్ అవుతుందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ‘కేజీఎఫ్ 3’ కోసం ప్రశాంత్ నీల్ తన ప్రస్తుత ప్రాజెక్టులు పూర్తి చేసే వరకు యష్ వేచి చూసినా, ఈ క్రేజీ కాంబినేషన్‌పై భారీ అంచనాలు నెలకొనే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!