

కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటిస్తున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రం జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రబృందం షూటింగ్ పూర్తి చేసి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా కొనసాగిస్తోంది. హీరో, హీరోయిన్ ఇద్దరూ డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉండగా, మరోవైపు ట్రైలర్ కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ట్రైలర్ విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా ఈ సినిమా రన్‌టైమ్‌పై ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. దాదాపు మూడు గంటల నిడివితో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే విడుదలకు ఇంకా కొంత సమయం ఉండటంతో రన్‌టైమ్ తగ్గించే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది చూడాలి. రవి నంబూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సాయి రాజేష్ కథను అందించగా, ఎస్.కె.ఎన్, సాయి రాజేష్ నిర్మించారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!