
సినిమాలు

కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘చెన్నై లవ్ స్టోరీ’పై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సాయి రాజేష్ కథ, స్క్రీన్‌ప్లే అందించగా, ఎస్‌కేఎన్ నిర్మిస్తున్నారు. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు పూర్తి చేస్తోంది.
అయితే అదే రోజు విజయ్ నటించిన ‘జన నాయకన్’ కూడా విడుదల కానుండటంతో బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొననుంది. విజయ్ చివరి చిత్రం అనే ప్రచారం, తమిళంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారీ అంచనాల కారణంగా ఈ సినిమాపై ప్రత్యేక దృష్టి నెలకొంది. అయినప్పటికీ తెలుగు మార్కెట్‌లో ‘చెన్నై లవ్ స్టోరీ’ మంచి ఫలితం సాధిస్తుందనే నమ్మకంతో మేకర్స్ రిలీజ్ డేట్‌ను మార్చకుండా ముందుకు సాగుతున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!