
జనరల్

కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ ప్రధాన పాత్రల్లో నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ షూటింగ్ పూర్తి చేసుకుని జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. రవి నంబూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘బేబి’ విజయానంతరం ఎస్‌కేఎన్, సాయి రాజేష్ కలిసి మాస్ మూవీ మేకర్స్, అమృతా ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మించారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది.

ప్రమోషన్స్‌ను వేగవంతం చేసిన మేకర్స్, జూలై 18 మధ్యాహ్నం 3:30 గంటలకు హైదరాబాద్‌లోని AAA సినిమాస్‌లో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించి ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. భావోద్వేగాలతో కూడిన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!