

కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ విడుదలకు సిద్ధమైంది. రవి నంబూరి దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ డ్రామాలో శ్రీ గౌరి ప్రియ కథానాయికగా నటించగా, మణిశర్మ సంగీతం అందించారు. భావోద్వేగాలతో నిండిన ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలతో మంచి అంచనాలు ఏర్పడగా, విడుదలకు ముందు సెన్సార్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది.
సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ఎలాంటి కట్స్ సూచించకుండా ‘U/A’ సర్టిఫికేట్ జారీ చేసింది. సినిమా నిడివి 179 నిమిషాలు (2 గంటల 59 నిమిషాలు)గా ఖరారైంది. ప్రేమకథా చిత్రాలకు ఇది భారీ రన్టైమ్ అయినప్పటికీ, కథనం ఆకట్టుకుంటే ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో చిత్రబృందం ఉంది. గతంలో దాదాపు మూడు గంటల నిడివితో వచ్చిన ‘బేబి’ విజయాన్ని ఉదాహరణగా చూపిస్తూ, ‘చెన్నై లవ్ స్టోరీ’ కూడా అదే స్థాయిలో ప్రేక్షకాదరణ పొందుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!