

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కాకా’. ఈ సినిమా సెట్స్ నుంచి ఓ వీడియో లీక్ కావడంతో సామాజిక మాధ్యమాల్లో చర్చ మొదలైంది. ఎవరో రహస్యంగా చిత్రీకరించినట్లు చెబుతున్న ఈ వీడియోలో చిరంజీవి గతంలో చూడని యంగ్ లుక్‌లో కనిపిస్తున్నారు. చేతిలో సిగార్‌తో స్టైలిష్‌గా కనిపిస్తూ నటుడు మురళీధర్ గౌడ్‌తో మాట్లాడుతున్న దృశ్యాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
ఇప్పటివరకు చిరంజీవి యంగ్ లుక్‌ను చిత్రబృందం రహస్యంగానే ఉంచింది. అయితే, ఈ వీడియో బయటకు రావడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. త్వరలోనే చిత్రబృందం అధికారికంగా లుక్ పోస్టర్‌ను విడుదల చేస్తుందా అనేది చూడాలి. ‘టాక్సిక్’ చిత్రాన్ని నిర్మిస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ తెలుగులో నిర్మిస్తున్న తొలి చిత్రం ఇదే. ఈ సినిమా 2027 జనవరి 13న విడుదల కానుంది. అనస్వర రాజన్, నివేదా పేతురాజ్, కబీర్ దుహాన్ సింగ్, అనురాగ్ కశ్యప్, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా, తొలి పాటపై కూడా అభిమానులు అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!