

నటి తాప్సి తన కెరీర్‌లో అతిపెద్ద విజయంగా భావించేది కమర్షియల్ వసూళ్ల కోసం పరుగులు తీయడం కాదని, నమ్మకంతో ప్రయోగాత్మకమైన మరియు నాయికా ప్రాధాన్య కథలను ఎంచుకుని రిస్క్ తీసుకోవడమేనని తెలిపింది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుందని నిరూపించుకోవాలనే ఒత్తిడిలో తాను ఉండదలచుకోలేదని చెప్పింది. తనకు నచ్చిన కథను ప్రేక్షకులు కూడా ఆదరిస్తారనే విశ్వాసంతోనే సినిమాలను ఎంపిక చేస్తానని వెల్లడించింది.
అర్థవంతమైన కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో రచయితలు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులతో పాటు ప్రేక్షకుల పాత్ర కూడా ఎంతో ముఖ్యమని తాప్సి పేర్కొంది. అయితే కొత్త తరహా కథలను ప్రోత్సహించే విషయంలో నటీనటులే కీలక పాత్ర పోషించాలని ఆమె అభిప్రాయపడింది. మంచి కథలపై నమ్మకం ఉంచి సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాలని సూచించిన తాప్సి, త్వరలో 'గాంధారి' చిత్రంతో ప్రేక్షకులను అలరించనుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!