

హాలీవుడ్ స్టార్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన విజువల్ స్పెక్టకిల్ ది ఒడిస్సీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. మ్యాట్ డామన్, టామ్ హాలండ్, అన్నే హాత్వే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం జూలై 17న భారీ అంచనాల మధ్య విడుదలై తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇండియాలో తొలి రోజు రూ.17.40 కోట్ల వసూళ్లు సాధించిన ఈ సినిమా, రెండో రోజు రూ.22 కోట్లు రాబట్టి రెండు రోజుల్లో రూ.39.40 కోట్ల షేర్, రూ.47.03 కోట్ల గ్రాస్‌ను నమోదు చేసింది. ఇంగ్లీష్ వెర్షన్ అత్యధిక వసూళ్లు సాధించగా, తెలుగు, హిందీ, తమిళ భాషల్లో కూడా మంచి ఆదరణ లభిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా కూడా ది ఒడిస్సీ రికార్డు స్థాయి వసూళ్లను నమోదు చేసింది. కేవలం రెండు రోజుల్లోనే 257.8 మిలియన్ డాలర్లు (రూ.2,150 కోట్లకు పైగా) వసూలు చేసి క్రిస్టోఫర్ నోలన్ కెరీర్లోనే అతిపెద్ద గ్లోబల్ ఓపెనింగ్గా నిలిచింది. ఇందులో ఉత్తర అమెరికా మార్కెట్ నుంచి 120.5 మిలియన్ డాలర్లు, ఇతర దేశాల నుంచి 137.3 మిలియన్ డాలర్లు వచ్చాయి. నోలన్ గత బ్లాక్బస్టర్లు ది డార్క్ నైట్ రైజెస్, ఓపెన్‌హైమర్ ఓపెనింగ్ రికార్డులను కూడా ఈ చిత్రం అధిగమించడంతో బాక్సాఫీస్ వద్ద కొత్త చరిత్ర సృష్టించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!