

రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద మంచి స్పందనతో దూసుకెళ్తోంది. తండ్రీకూతురు అనుబంధానికి అయ్యప్ప స్వామి నేపథ్యాన్ని జోడించి రూపొందించిన ఈ చిత్రంలో రవితేజ అయ్యప్ప మాలధారిగా సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. ఈ పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుండగా, తాజాగా సినిమాకు సంబంధించిన ఓ అభిమాని రూపొందించిన ఫొటో అంతర్జాతీయంగా ఆసక్తిని రేపుతోంది.
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్.. అయ్యప్ప మాల ధరించిన రవితేజ గెటప్‌లో ఉన్న తన ఫ్యాన్ ఎడిట్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రీపోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. గతంలోనూ వార్నర్ తెలుగు సినిమాలు, పాటలపై తనదైన శైలిలో స్పందిస్తూ అభిమానులను అలరించారు. తెలుగు చిత్రాల డైలాగులు చెప్పడం, పాటలకు స్టెప్పులు వేయడం వంటి వాటితో పలుమార్లు వైరల్ అయిన వార్నర్, ఇప్పుడు ‘ఇరుముడి’కి సంబంధించిన ఫొటోను షేర్ చేయడంతో మరోసారి తెలుగు సినీ అభిమానుల దృష్టిని ఆకర్షించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!