
బిజినెస్

బాలీవుడ్ సీనియర్ నటి హేమ మాలిని సినీ పరిశ్రమలో 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముంబైలో 'డ్రీమ్ గర్ల్స్ డైమండ్ జూబ్లీ' వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తన సినీ ప్రయాణానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
ఈ సందర్భంగా తన బయోపిక్ వస్తే తన పాత్రలో ఎవరు నటించాలని కోరుకుంటారని అడగగా, దీపికా పదుకొణె పేరు సూచించారు. దీపికా ఎంతో అందమైన, ప్రతిభావంతమైన నటి అని ప్రశంసించిన హేమ మాలిని, ఆమె తన పాత్రకు అన్ని విధాలా సరైన ఎంపిక అని పేర్కొన్నారు. బయోపిక్‌పై అధికారిక ప్రకటన ఏదీ లేకపోయినా, ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.














కామెంట్స్ (2)
Wow
Wow