

మాస్ మహారాజా రవితేజ వరుస చిత్రాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో, దర్శకుడు వివేక్ ఆత్రేయతో చేయనున్న కొత్త సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన తాజా సమాచారం ప్రకారం కథానాయిక ఎంపిక దాదాపు పూర్తయినట్లు సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. రవితేజ సరసన గ్లామర్ హీరోయిన్ డింపుల్ హయాతి నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రాకపోయినా, ఈ వార్త టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. విభిన్న కథనాలతో గుర్తింపు పొందిన వివేక్ ఆత్రేయ ఈసారి కూడా ప్రత్యేకమైన కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారనే అంచనాలు ఉన్నాయి.
ఈ వార్త నిజమైతే రవితేజ, డింపుల్ హయాతి జోడీగా ఇది వరుసగా 3వ చిత్రం కానుంది. గతంలో ‘కిలాడీ’, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రాల్లో కలిసి నటించిన ఈ జంట మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఒకే హీరోతో వరుసగా మూడోసారి నటించే అవకాశం అరుదుగా దక్కుతుండటంతో ఈ కాంబినేషన్‌పై ఆసక్తి పెరిగింది. రవితేజ ఎనర్జీకి తగ్గట్టుగా వివేక్ ఆత్రేయ ఎలాంటి కథను సిద్ధం చేశారన్నది కూడా సినీ అభిమానుల్లో చర్చకు దారితీస్తోంది. చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశముందని సమాచారం.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!