

‘రాజాసాబ్’ చిత్రం తర్వాత దర్శకుడు మారుతి తన తదుపరి ప్రాజెక్టుపై దృష్టి సారించినట్లు సమాచారం. భారీ బడ్జెట్, ప్రముఖ హీరోలతో సినిమా చేయడం కంటే తనకు బాగా పట్టున్న కామెడీ జానర్లోనే మరో కొత్త ప్రయత్నం చేయాలని భావిస్తున్నారట. ‘భలే భలే మగాడివోయ్’, ‘మహానుభావుడు’ చిత్రాల తరహాలో కథానాయకుడిలోని ఓ ప్రత్యేకమైన బలహీనత చుట్టూ వినోదభరితమైన కథను రూపొందించేందుకు సిద్ధమవుతున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈసారి పూర్తిగా కొత్త నటీనటులతో సినిమాను తెరకెక్కించాలని మారుతి యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
బలమైన కథ, ఆసక్తికరమైన పాత్రలు ఉంటే స్టార్ హీరోలు లేకపోయినా ప్రేక్షకులను నవ్వించవచ్చనే నమ్మకంతో ఈ ప్రాజెక్టును రూపొందించనున్నట్లు సమాచారం. నవంబర్లో చిత్రీకరణ ప్రారంభించి, వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రచారం సాగుతోంది. మారుతి తనదైన కామెడీ శైలితో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు చేస్తున్న ఈ ప్రయత్నంపై టాలీవుడ్లో ఆసక్తి నెలకొంది. అయితే, సినిమా టైటిల్, నటీనటులు, ఇతర నిర్మాణ వివరాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!