11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సినిమాలో ఇంటర్వెల్ ఎందుకు వస్తుందో తెలుసా?

Writer: Shivani K 12:56 PM, 11 సెప్టెంబర్, 2026
సినిమాలో ఇంటర్వెల్ ఎందుకు వస్తుందో తెలుసా?

థియేటర్‌లో సినిమా చూస్తున్నప్పుడు మధ్యలో ‘ఇంటర్వెల్’ అంటూ విరామం రావడం ప్రేక్షకులకు సర్వసాధారణం. సాధారణంగా కథలో కీలకమైన మలుపు తర్వాత వచ్చే ఈ బ్రేక్.. ప్రేక్షకుల్లో ఉత్కంఠను మరింత పెంచుతుంది. అయితే సినిమా మధ్యలో ఇంటర్వెల్ ఎందుకు వస్తుందనే విషయం చాలామందికి తెలియదు. పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ కొనుగోలు చేసేందుకు మాత్రమే ఈ విరామం తీసుకురాలేదు. ఒకప్పుడు సినిమాలను డిజిటల్ టెక్నాలజీతో కాకుండా ఫిల్మ్ రీళ్లను ప్రొజెక్టర్ ద్వారా ప్రదర్శించేవారు. ఒక రీల్ పూర్తయిన తర్వాత మరో రీల్‌ను ప్రొజెక్టర్‌లో అమర్చేందుకు కొంత సమయం పట్టేది. సాధారణంగా ఈ ప్రక్రియకు 10 నుంచి 15 నిమిషాల సమయం అవసరమయ్యేది. ప్రేక్షకులను ఆ సమయంలో ఖాళీగా కూర్చోబెట్టకుండా విరామం ఇచ్చేవారు. అలా సినిమాల్లో ఇంటర్వెల్ సంప్రదాయం ప్రారంభమైంది.

కాలక్రమేణా ఫిల్మ్ రీళ్ల స్థానంలో డిజిటల్ ప్రొజెక్షన్ అందుబాటులోకి రావడంతో రీళ్లు మార్చాల్సిన అవసరం లేకుండా పోయింది. అయినప్పటికీ ప్రేక్షకులకు అలవాటైన ఇంటర్వెల్‌ను కొనసాగించారు. క్రమంగా అది సినిమా ప్రదర్శనలో ఒక భాగంగా, భారతీయ సినిమా సంస్కృతిలో ప్రత్యేకమైన సంప్రదాయంగా మారింది. అయితే ప్రస్తుతం ఈ విరామం థియేటర్ యాజమాన్యాలకు అదనపు ఆదాయ వనరుగా మారిందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇంటర్వెల్ సమయంలో ప్రేక్షకులు పాప్‌కార్న్, చిప్స్, సమోసా, కూల్‌డ్రింక్స్ వంటి వాటిని కొనుగోలు చేస్తుంటారు. ఒకప్పుడు తక్కువ ధరకు లభించిన ఈ తినుబండారాలు ఇప్పుడు థియేటర్లలో అధిక ధరలకు విక్రయిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వాటర్ బాటిల్‌కు కూడా ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తోందని ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కుటుంబంతో కలిసి సినిమా చూసేందుకు వెళ్లినప్పుడు టికెట్లతో పాటు స్నాక్స్, డ్రింక్స్, ఇతర ఖర్చులు కలిపి సింగిల్ స్క్రీన్‌లో మధ్యతరగతి కుటుంబానికి సుమారు రూ.1,500 నుంచి రూ.2,000 వరకు ఖర్చవుతున్న పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఒకప్పుడు రీల్ మార్చేందుకు అవసరమైన సాంకేతిక విరామంగా ప్రారంభమైన ఇంటర్వెల్.. ఇప్పుడు ప్రేక్షకులకు అదనపు ఖర్చుగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలుగు చిత్రసీమలో చక్రవర్తి స్వర ప్రస్థానంలోని విశేషాలివే...

తెలుగు చిత్రసీమలో చక్రవర్తి స్వర ప్రస్థానంలోని విశేషాలివే...

ఆయనంటే నాకు చాలా అభిమానం -  బ్రహ్మాజీ

ఆయనంటే నాకు చాలా అభిమానం - బ్రహ్మాజీ

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి శ్రియ శరణ్‌..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి శ్రియ శరణ్‌..

ఓ దశలో నటనకు గుడ్‌బై చెప్పాలనుకున్నా - సమంత

ఓ దశలో నటనకు గుడ్‌బై చెప్పాలనుకున్నా - సమంత

డిసెంబర్‌లో దూసుకొస్తున్న వృషకర్మ?

డిసెంబర్‌లో దూసుకొస్తున్న వృషకర్మ?

అన్నయ్య దూకుడు.. తమ్ముడు తడబాటు?

అన్నయ్య దూకుడు.. తమ్ముడు తడబాటు?

ట్యాగ్లు
సినిమా ఇంటర్వెల్థియేటర్సినిమా థియేటర్లుఫిల్మ్ రీళ్లుడిజిటల్ ప్రొజెక్షన్పాప్‌కార్న్థియేటర్ స్నాక్స్సినిమా టికెట్ ధరలుభారతీయ సినిమాసినీ ప్రేక్షకులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫైల్స్ క్లియరెన్స్‌పై చంద్రబాబు కీలక సమీక్ష
జనరల్

ఫైల్స్ క్లియరెన్స్‌పై చంద్రబాబు కీలక సమీక్ష

ఏఐ మెహందీ మెషీన్ వైరల్.. ఉద్యోగాలపై కొత్త చర్చ
టెక్నాలజీ

ఏఐ మెహందీ మెషీన్ వైరల్.. ఉద్యోగాలపై కొత్త చర్చ

తెలుగు చిత్రసీమలో చక్రవర్తి స్వర ప్రస్థానంలోని విశేషాలివే...
సినిమాలు

తెలుగు చిత్రసీమలో చక్రవర్తి స్వర ప్రస్థానంలోని విశేషాలివే...

వైభవ్‌పై ఇషాన్‌ చేసిన కామెంట్స్ వైరల్
క్రీడలు

వైభవ్‌పై ఇషాన్‌ చేసిన కామెంట్స్ వైరల్

వీల్‌చైర్‌లో వెళ్తున్న వ్యక్తిపై దొంగల దాడి
జనరల్

వీల్‌చైర్‌లో వెళ్తున్న వ్యక్తిపై దొంగల దాడి

ఏళ్ల తర్వాత ఆలయ చోరీ సొత్తు ప్రత్యక్షం
జనరల్

ఏళ్ల తర్వాత ఆలయ చోరీ సొత్తు ప్రత్యక్షం

రాహుల్ గాంధీ ప్రధాని కావాలని పాదయాత్ర చేసిన వ్యక్తి అసెంబ్లీకి రాక
జనరల్

రాహుల్ గాంధీ ప్రధాని కావాలని పాదయాత్ర చేసిన వ్యక్తి అసెంబ్లీకి రాక

కలెక్టర్ల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
జనరల్

కలెక్టర్ల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

సినిమాలో ఇంటర్వెల్ ఎందుకు వస్తుందో తెలుసా?
సినిమాలు

సినిమాలో ఇంటర్వెల్ ఎందుకు వస్తుందో తెలుసా?

అసెంబ్లీ ఘటనపై విజయ రహట్కర్‌కు బీఆర్‌ఎస్ ఫిర్యాదు
జనరల్

అసెంబ్లీ ఘటనపై విజయ రహట్కర్‌కు బీఆర్‌ఎస్ ఫిర్యాదు

మోదీ, జిన్‌పింగ్‌ ద్వైపాక్షిక భేటీకి రంగం సిద్ధం
జనరల్

మోదీ, జిన్‌పింగ్‌ ద్వైపాక్షిక భేటీకి రంగం సిద్ధం

కవిత కీలక డిమాండ్.. సీఎం స్పష్టత ఇవ్వాలని హెచ్చరిక
రాజకీయాలు

కవిత కీలక డిమాండ్.. సీఎం స్పష్టత ఇవ్వాలని హెచ్చరిక

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!