9, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ఎపిక్’ బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: విజయ్ దేవరకొండ

Writer: Nithish 09:53 AM, 9 సెప్టెంబర్, 2026
‘ఎపిక్’ బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: విజయ్ దేవరకొండ

ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్‌’ ప్రీ రిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. సెప్టెంబర్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి ‘90s’ వెబ్‌ సిరీస్‌తో గుర్తింపు పొందిన ఆదిత్య హాసన్‌ దర్శకత్వం వహించారు. ఈ వేడుకకు రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ, దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విజయ్‌ మాట్లాడుతూ.. ఆనంద్‌ సినిమాల ఎంపిక పట్ల తనకు ఎంతో గర్వంగా ఉందని, ‘ఎపిక్‌’ అతడి ఫిల్మోగ్రఫీలో ఒక అందమైన చిత్రంగా నిలుస్తుందని అన్నారు. తెలుగు సినిమా ప్రస్తుతం మంచి దశలో ఉందని, ‘ఎపిక్‌’తో వరుస విజయాల పరంపర కొనసాగాలని ఆకాంక్షించారు. సందీప్‌ రెడ్డి వంగా మాట్లాడుతూ.. ఆనంద్‌కు సినిమాలపై ఉన్న ఆసక్తిని తాను ఎప్పటి నుంచో గమనిస్తున్నానని, ఏ పాత్రలోనైనా అతడు సహజంగా ఒదిగిపోతాడని ప్రశంసించారు. ఆదిత్య హాసన్‌ రచన ఎంతో బాగుందని, అనుభవజ్ఞుడైన రచయిత రాసినట్లుగా అనిపించిందని పేర్కొంటూ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.

ఆనంద్‌ దేవరకొండ మాట్లాడుతూ.. ‘ఎపిక్‌’ 23 నుంచి 26 ఏళ్ల వయసులోని యువత ఎదుర్కొనే ప్రేమ, కుటుంబం, బాధ్యతలకు సంబంధించిన భావోద్వేగాలను ప్రతిబింబించే కథ అని అన్నారు. సహజమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రతి ఒక్కరూ తమను తాము చూసుకుంటారని చెప్పారు. వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. కడలి అనే పాత్రలో నటించానని, తన పాత్ర ద్వారా ఆత్మవిశ్వాసం, ధైర్యం వంటి అంశాలను నేర్చుకున్నానని తెలిపారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. అబ్బాయి, అమ్మాయి మధ్య బంధాన్ని ఎంతో సహజంగా, స్వచ్ఛంగా చూపించిన చిత్రమిదని, కుటుంబ సభ్యులతో కలిసి చూసి ఆస్వాదించవచ్చని అన్నారు. దర్శకుడు ఆదిత్య హాసన్‌ మాట్లాడుతూ.. ప్రేక్షకులు తనపై ఉంచిన నమ్మకాన్ని ‘ఎపిక్‌’తో నిలబెట్టుకుంటానని తెలిపారు. నటుడు శివాజీ, సంగీత దర్శకుడు హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌ తదితరులు కూడా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హనుమాన్ అంశ్: చిన్న సినిమాకు భారీ విజయం ఎలా?

హనుమాన్ అంశ్: చిన్న సినిమాకు భారీ విజయం ఎలా?

శివరాజ్‌కుమార్ వ్యాఖ్యలపై కన్నడిగుల ఆగ్రహం.. ఎందుకంటే?

శివరాజ్‌కుమార్ వ్యాఖ్యలపై కన్నడిగుల ఆగ్రహం.. ఎందుకంటే?

మహేంద్రగిరి వారాహితో భారీ హిట్‌పై కన్నేసిన సుమంత్!

మహేంద్రగిరి వారాహితో భారీ హిట్‌పై కన్నేసిన సుమంత్!

యష్‌ను మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి తీసుకురాగలిగేది ఆ స్టార్ డైరెక్టరేనా..?

యష్‌ను మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి తీసుకురాగలిగేది ఆ స్టార్ డైరెక్టరేనా..?

‘హనుమాన్ అంష్’ బ్లాక్‌బస్టర్ జోరు...
ట్యాగ్లు
ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ఆనంద్ దేవరకొండవైష్ణవి చైతన్యవిజయ్ దేవరకొండసందీప్ రెడ్డి వంగాఆదిత్య హాసన్సూర్యదేవర నాగవంశీసితార ఎంటర్‌టైన్‌మెంట్స్హేషమ్ అబ్దుల్ వహాబ్ప్రీ రిలీజ్ ఈవెంట్తెలుగు సినిమాఎపిక్ మూవీ

‘హనుమాన్ అంష్’ బ్లాక్‌బస్టర్ జోరు...

‘సర్దార్ 2’ కోసం మాళవిక మోహనన్ రిస్కీ స్టంట్.. అంత ఎత్తు నుంచి జంప్!

‘సర్దార్ 2’ కోసం మాళవిక మోహనన్ రిస్కీ స్టంట్.. అంత ఎత్తు నుంచి జంప్!

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేడు టీటీడీ బోర్డు మీటింగ్..
జనరల్

నేడు టీటీడీ బోర్డు మీటింగ్..

నేడు గవర్నర్‌ను కలవనున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు..
రాజకీయాలు

నేడు గవర్నర్‌ను కలవనున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు..

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల్లో భారీ వృద్ధి..
బిజినెస్

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల్లో భారీ వృద్ధి..

చైనా టిబెట్‌లో మరోసారి భూకంపం..
జనరల్

చైనా టిబెట్‌లో మరోసారి భూకంపం..

మెటా నుంచి కొత్త ‘మ్యూజ్’ ఏఐ ఏజెంట్
టెక్నాలజీ

మెటా నుంచి కొత్త ‘మ్యూజ్’ ఏఐ ఏజెంట్

సర్దార్ 2 కోసం మాళవిక సాహసం!
సినిమాలు

సర్దార్ 2 కోసం మాళవిక సాహసం!

ఎన్‌హెచ్‌-66 వంతెన పగుళ్లకు ఎం-సీల్‌తో మరమ్మతులు?
జనరల్

ఎన్‌హెచ్‌-66 వంతెన పగుళ్లకు ఎం-సీల్‌తో మరమ్మతులు?

రామాయణకు గట్టి పోటీగా నయన్ సీక్వెల్?
గాసిప్స్

రామాయణకు గట్టి పోటీగా నయన్ సీక్వెల్?

బాలయ్యతో కాజల్ మాస్ కెమిస్ట్రీ!
సినిమాలు

బాలయ్యతో కాజల్ మాస్ కెమిస్ట్రీ!

టాక్సిక్ ఓటీటీ డీల్‌కు భారీ షాక్?
గాసిప్స్

టాక్సిక్ ఓటీటీ డీల్‌కు భారీ షాక్?

అమెరికా-ఇరాన్‌ మధ్య ముదురుతున్న ఉద్రిక్తతలు
జనరల్

అమెరికా-ఇరాన్‌ మధ్య ముదురుతున్న ఉద్రిక్తతలు

హనుమాన్ అంశ్: చిన్న సినిమాకు భారీ విజయం ఎలా?
సినిమాలు

హనుమాన్ అంశ్: చిన్న సినిమాకు భారీ విజయం ఎలా?

‘ఎపిక్’ బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: విజయ్ దేవరకొండ
సినిమాలు

‘ఎపిక్’ బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: విజయ్ దేవరకొండ

శివరాజ్‌కుమార్ వ్యాఖ్యలపై కన్నడిగుల ఆగ్రహం.. ఎందుకంటే?
సినిమాలు

శివరాజ్‌కుమార్ వ్యాఖ్యలపై కన్నడిగుల ఆగ్రహం.. ఎందుకంటే?

బిగ్‌బాస్ 10 తెలుగు డే 2: రోహిత్ యాటిట్యూడ్‌పై వర్షిణి ఫైర్..
షోస్

బిగ్‌బాస్ 10 తెలుగు డే 2: రోహిత్ యాటిట్యూడ్‌పై వర్షిణి ఫైర్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!