

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు ‘ఫౌజీ’ చిత్రబృందం ప్రత్యేక కానుకను సిద్ధం చేసింది. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి ప్రత్యేక వీడియోను విడుదల చేయనున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన ఎర్నేని రవిశంకర్ వెల్లడించారు. కేవలం పోస్టర్‌కే పరిమితం కాకుండా, సినిమా కథా నేపథ్యం, ప్రభాస్ పాత్ర స్వభావం, దర్శకుడు హను రాఘవపూడి రూపొందిస్తున్న ప్రపంచాన్ని పరిచయం చేసేలా ఈ వీడియో ఉంటుందని తెలిపారు. అయితే, దీన్ని భారీ గ్లింప్స్‌గా కాకుండా సినిమా నేపథ్యాన్ని వివరించే ప్రత్యేక కంటెంట్‌గా చూడాలని సూచించారు.
ప్రభాస్ ‘ఫౌజీ’ స్పెషల్ వీడియోను అక్టోబర్ 23న హారర్ చిత్రం ‘418’ ప్రదర్శించే థియేటర్లలోనూ వీక్షించవచ్చని నిర్మాత తెలిపారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో ఇమాన్వీ కథానాయికగా నటిస్తున్నారు. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భానుచందర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రభాస్ పుట్టినరోజున విడుదలయ్యే ఈ వీడియోలో ఆయన పాత్ర, సినిమా కథా ప్రపంచానికి సంబంధించిన వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!