

మర్డర్ మిస్టరీ, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘తత్వం’ చిత్రం ట్రైలర్ హైదరాబాద్‌లో విడుదలై మంచి స్పందనను అందుకుంది. కొత్త కథలు, వినూత్నమైన కథాంశాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. దినేష్ తేజ్, దష్విక కె హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి అర్జున్ కోలా దర్శకత్వం వహించారు. వంశీ సీమకుర్తి, శ్వేత పసుపులేటి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఉత్కంఠభరితమైన కథ, బలమైన స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందింది.
ఈ కార్యక్రమంలో ఎడిటర్ విప్లవ్ నైషదం, సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుందని, ఎమోషనల్ కనెక్టివిటీతో పాటు అనూహ్యమైన ట్విస్ట్‌లు ఉంటాయని తెలిపారు. దర్శకుడు అర్జున్ కోలా ఈ కథ నిజజీవిత ఘటనల నుంచి ప్రేరణ పొందిందని వెల్లడించగా, హీరో దినేష్ తేజ్ ఈ చిత్రం తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!