
జనరల్

అనిల్ సుంకర నిర్మాణంలో రూపొందుతున్న ‘ఎయిర్ ఫోర్స్ (బెజవాడ బ్యాచ్)’ చిత్ర టీజర్ తాజాగా విడుదలై ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. నితిన్ నాష్, సోమయాజీ, కృష్ణ, రోహన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అనిల్ కైవల్య దర్శకత్వం వహిస్తున్నారు. విజయవాడకు చెందిన నలుగురు యువకుల స్నేహం, సరదా సంఘటనలు, యూత్‌ఫుల్ హాస్యంతో కథ సాగనున్నట్లు టీజర్ ద్వారా స్పష్టమవుతోంది.
ప్రత్యేకంగా విజయవాడ సంస్కృతి, స్థానిక భాషా శైలి, యువతకు దగ్గరగా ఉండే అంశాలను చిత్రబృందం వినోదాత్మకంగా చూపించింది. సినిమాటోగ్రాఫర్ శ్యామ్ తుమ్మలపల్లి విజయవాడ అందాలను ఆకట్టుకునేలా తెరపై ఆవిష్కరించగా, కొత్త నటీనటుల సహజ నటన టీజర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్నేహం, వినోదం, స్థానికతను కలిపిన ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!