
జనరల్

తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన రమ్యకృష్ణ తన కెరీర్‌ను ఎంతో విజయవంతంగా కొనసాగించారు. ప్రస్తుతం ఎంపిక చేసిన పాత్రల్లో మాత్రమే నటిస్తున్న ఆమె, దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. అయితే ఆమెకు తొలి సినిమా అవకాశం చాలా అనుకోని విధంగా వచ్చిన విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
‘వెల్లై మనసు’ సినిమా కోసం హీరోయిన్‌ను వెతుకుతున్న సమయంలో మూవీ టీమ్ ఒక బిస్కెట్ ప్రకటనలో కనిపించిన రమ్యకృష్ణను గుర్తించింది. ఆ ప్రకటనలో ఆమె లుక్ నచ్చడంతో వివరాలు సేకరించి కుటుంబ సభ్యులను సంప్రదించారు. అనంతరం ఆమెకు ఆ సినిమాలో అవకాశం లభించగా, అక్కడి నుంచి ప్రారంభమైన సినీ ప్రయాణం ఆమెను దక్షిణ భారత సినీ పరిశ్రమలో అగ్ర నటిగా నిలబెట్టింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!