

తాప్సీ పన్నూ ప్రధాన పాత్రలో నటించిన ‘గాంధారి’ ట్రైలర్ విడుదలైన నేపథ్యంలో మహిళా పాత్రలపై చర్చ మొదలైంది. కనికా కపూర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో తాప్సీ ఇప్పటివరకు చేసిన పాత్రలకు భిన్నంగా లక్ష్యంతో పోరాడే మహిళగా కనిపిస్తున్నారు. కూతురు కోసం పోరాడే తల్లిగా, చూపు లేకపోయినా చైల్డ్ ట్రాఫికింగ్ మాఫియాను ఎదుర్కొనే పాత్రలో ఆమె కనిపించనున్నారు. దీంతో కొందరు నెటిజన్లు ఈ చిత్రాన్ని యష్ నటించిన ‘టాక్సిక్’తో పోలుస్తున్నారు.
‘టాక్సిక్’లో మహిళా పాత్రలకు తగినంత ప్రాధాన్యత దక్కలేదనే విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ పోలికలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మరోవైపు ‘గాంధారి’లో మహిళా పాత్రలకు బలమైన కథ, నిర్ణయాలు, భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేవాశిష్ మఖిజా దర్శకత్వంలో, కనికా ధిల్లాన్ కథతో రూపొందిన ‘గాంధారి’ సెప్టెంబర్ 3న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!