
జనరల్

సామాజిక మాధ్యమాల ప్రభావం పెరుగుతున్న ప్రస్తుత కాలంలో చిన్న పుకార్లు కూడా ఎంత పెద్ద సమస్యలకు దారితీస్తాయో చూపించే ప్రయత్నంగా ‘గాసిప్’ చిత్రం తెరకెక్కింది. రాశి సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. వైభవ్ సినీ స్కల్ప్ట్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రానికి వైభవ్ కౌండిన్య దర్శకత్వం వహించారు. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ కథను రూపొందించినట్లు దర్శకుడు తెలిపారు. పుకార్ల వల్ల కలిగే మానసిక ఒత్తిడి, వ్యక్తిగత నష్టం, సామాజిక బాధ్యత వంటి అంశాలను చిత్రంలో చూపించినట్లు వెల్లడించారు. మహిళా ప్రధాన కథాంశంతో వస్తున్న ఈ చిత్రంలో రాశి సింగ్ కీలక పాత్ర పోషించారు. వినోదంతో పాటు సందేశాన్ని అందించే ఈ సినిమా యువతను ఆలోచింపజేస్తుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!