11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలుగు చిత్రసీమలో చక్రవర్తి స్వర ప్రస్థానంలోని విశేషాలివే...

Writer: Shivani K 01:29 PM, 11 సెప్టెంబర్, 2026
తెలుగు చిత్రసీమలో చక్రవర్తి స్వర ప్రస్థానంలోని విశేషాలివే...

తెలుగు చలనచిత్ర సంగీత ప్రపంచాన్ని దాదాపు ఒకటిన్నర దశాబ్దం పాటు తన బాణీలతో శాసించిన సంగీత దర్శకుడు చక్రవర్తి. ఆయన అసలు పేరు కొమ్మినేని అప్పారావు. నటుడు, దర్శకుడు కొమ్మినేని శేషగిరిరావు సోదరుడైన చక్రవర్తి తొలుత గాయకుడిగా సినీ ప్రయాణం ప్రారంభించారు. కన్నడ చిత్రం ‘మాంగళ్య యోగం’లో తొలి పాట పాడిన ఆయన, అనంతరం ‘జయ విజయ’ చిత్రంలోనూ పాటలు పాడారు. గాయకుడిగా కొనసాగడం ఇష్టం లేక దర్శకుడు సి.ఎస్.రావు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత డబ్బింగ్ ఆర్టిస్టుగా మారి ఎంజీఆర్, శివాజీ గణేశన్, కమల్ హాసన్, రజనీకాంత్ వంటి అగ్ర నటులకు తెలుగులో డబ్బింగ్ చెప్పారు. సమతా మూవీస్ అధినేత ఛటర్జీ అప్పారావు పేరును ‘చక్రవర్తి’గా మార్చి, 1971లో ‘మూగ ప్రేమ’ చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయం చేశారు. ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోయినా, నిర్మాత క్రాంతి కుమార్ ‘శారద’ చిత్రంతో మరో అవకాశం ఇచ్చారు. కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘శారద’ మ్యూజికల్ హిట్ కావడంతో చక్రవర్తికి మంచి గుర్తింపు వచ్చింది. అనంతరం ‘ఇదా లోకం’, ‘బాబు’, ‘అన్నదమ్ముల అనుబంధం’ వంటి చిత్రాలకు సంగీతం అందించారు.

1977లో విడుదలైన ఎన్టీఆర్ ‘యమగోల’ చక్రవర్తి కెరీర్‌ను మలుపుతిప్పింది. సినిమాలోని పాటలన్నీ ఘన విజయం సాధించడంతో ఆయన పూర్తి స్థాయి మాస్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగారు. ‘16 ఏళ్ల వయసు’తో క్లాస్, మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన ‘డ్రైవర్ రాముడు’, ‘కొండవీటి సింహం’, ‘బలిపీఠం’, ‘జేబు దొంగ’, ‘ప్రేమాభిషేకం’ వంటి చిత్రాలకు చిరస్థాయిగా నిలిచిపోయే బాణీలు అందించారు. నాలుగు తరాల హీరోలకు సంగీత విజయాలను అందించిన చక్రవర్తి.. ఏడాదికి దాదాపు 80 సినిమాలకు పనిచేసిన ఘనత సాధించారు. 1981, 1982 నాటికి అగ్ర సంగీత దర్శకులను అధిగమించి 1988 వరకు నంబర్ వన్ స్థానంలో కొనసాగారు. మొత్తం 959 చిత్రాలకు సంగీతం అందించిన ఆయన 1,000 సినిమాల అరుదైన రికార్డుకు కేవలం 41 చిత్రాల దూరంలో నిలిచారు. పెద్ద కుమారుడు రాజేంద్ర ప్రసాద్ బైక్ ప్రమాదంలో మరణించడంతో తీవ్ర విషాదానికి గురైన చక్రవర్తి 1989 నుంచి సినీ సంగీతానికి దూరమయ్యారు. 2002 ఫిబ్రవరి 3న రెండు కిడ్నీలు విఫలమై కన్నుమూయడంతో తెలుగు సినీ సంగీతంలో ఓ స్వర్ణయుగానికి ముగింపు పలికింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సినిమాలో ఇంటర్వెల్ ఎందుకు వస్తుందో తెలుసా?

సినిమాలో ఇంటర్వెల్ ఎందుకు వస్తుందో తెలుసా?

ఆయనంటే నాకు చాలా అభిమానం -  బ్రహ్మాజీ

ఆయనంటే నాకు చాలా అభిమానం - బ్రహ్మాజీ

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి శ్రియ శరణ్‌..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి శ్రియ శరణ్‌..

ఓ దశలో నటనకు గుడ్‌బై చెప్పాలనుకున్నా - సమంత

ఓ దశలో నటనకు గుడ్‌బై చెప్పాలనుకున్నా - సమంత

డిసెంబర్‌లో దూసుకొస్తున్న వృషకర్మ?

డిసెంబర్‌లో దూసుకొస్తున్న వృషకర్మ?

అన్నయ్య దూకుడు.. తమ్ముడు తడబాటు?

అన్నయ్య దూకుడు.. తమ్ముడు తడబాటు?

ట్యాగ్లు
చక్రవర్తికొమ్మినేని అప్పారావుతెలుగు సినిమా సంగీతంసంగీత దర్శకుడు చక్రవర్తియమగోలఎన్టీఆర్శారదప్రేమాభిషేకంతెలుగు సినీ సంగీతంసినీ చరిత్ర
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సైమ్ అయూబ్ ఎంపికపై నాజర్ హుస్సేన్ ఫైర్
క్రీడలు

సైమ్ అయూబ్ ఎంపికపై నాజర్ హుస్సేన్ ఫైర్

తల్లి అంత్యక్రియలకు చిన్మయ్ కృష్ణ దాస్‌కు పెరోల్
జనరల్

తల్లి అంత్యక్రియలకు చిన్మయ్ కృష్ణ దాస్‌కు పెరోల్

మహేంద్రగిరి వారాహి మూవీ రివ్యూ.. మిస్టరీ థ్రిల్లర్ సుమంత్ ఎలా ఉందంటే?
రివ్యూలు

మహేంద్రగిరి వారాహి మూవీ రివ్యూ.. మిస్టరీ థ్రిల్లర్ సుమంత్ ఎలా ఉందంటే?

ఫైల్స్ క్లియరెన్స్‌పై చంద్రబాబు కీలక సమీక్ష
జనరల్

ఫైల్స్ క్లియరెన్స్‌పై చంద్రబాబు కీలక సమీక్ష

ఏఐ మెహందీ మెషీన్ వైరల్.. ఉద్యోగాలపై కొత్త చర్చ
టెక్నాలజీ

ఏఐ మెహందీ మెషీన్ వైరల్.. ఉద్యోగాలపై కొత్త చర్చ

తెలుగు చిత్రసీమలో చక్రవర్తి స్వర ప్రస్థానంలోని విశేషాలివే...
సినిమాలు

తెలుగు చిత్రసీమలో చక్రవర్తి స్వర ప్రస్థానంలోని విశేషాలివే...

వైభవ్‌పై ఇషాన్‌ చేసిన కామెంట్స్ వైరల్
క్రీడలు

వైభవ్‌పై ఇషాన్‌ చేసిన కామెంట్స్ వైరల్

వీల్‌చైర్‌లో వెళ్తున్న వ్యక్తిపై దొంగల దాడి
జనరల్

వీల్‌చైర్‌లో వెళ్తున్న వ్యక్తిపై దొంగల దాడి

ఏళ్ల తర్వాత ఆలయ చోరీ సొత్తు ప్రత్యక్షం
జనరల్

ఏళ్ల తర్వాత ఆలయ చోరీ సొత్తు ప్రత్యక్షం

రాహుల్ గాంధీ ప్రధాని కావాలని పాదయాత్ర చేసిన వ్యక్తి అసెంబ్లీకి రాక
జనరల్

రాహుల్ గాంధీ ప్రధాని కావాలని పాదయాత్ర చేసిన వ్యక్తి అసెంబ్లీకి రాక

కలెక్టర్ల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
జనరల్

కలెక్టర్ల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

సినిమాలో ఇంటర్వెల్ ఎందుకు వస్తుందో తెలుసా?
సినిమాలు

సినిమాలో ఇంటర్వెల్ ఎందుకు వస్తుందో తెలుసా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!