
సినిమాలు

టాలీవుడ్ స్టార్ హీరో, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పేరుకు సంబంధించిన ఆసక్తికర విషయాలను తాజాగా వెల్లడించారు. సినిమాల్లో స్టార్డమ్ సంపాదించిన అనంతరం రాజకీయాల్లోకి అడుగుపెట్టి జనసేన పార్టీని స్థాపించిన ఆయన ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో తన అసలు పేరు గురించి అభిమానులతో పంచుకున్నారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తన అసలు పేరు ‘శ్రీ కళ్యాణ్ కుమార్’ అని తెలిపారు. అయితే పాఠశాల రికార్డుల్లో ‘శ్రీ’ తొలగిపోవడంతో తన పేరు కే. కళ్యాణ్ కుమార్‌గా నమోదైందన్నారు. అనంతరం తనకు మార్షల్ ఆర్ట్స్ నేర్పిన గురువు పేరు ముందు ‘పవన్’ చేర్చారని, అప్పటి నుంచి ‘పవన్ కళ్యాణ్’గా అందరికీ పరిచయమయ్యానని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!