

తమిళ స్టార్ హీరో ధనుష్, దర్శకుడు మారి సెల్వరాజ్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘D56’ చిత్రం ఇప్పటికే సినీ వర్గాల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. అధికారిక ప్రకటన వెలువడినప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. తాజా సమాచారం ప్రకారం, సెప్టెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా, షూటింగ్ ప్రారంభానికి ముందే భారీ డిజిటల్ డీల్‌ను కుదుర్చుకున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.
ఇటీవల కొన్ని సినిమాలు షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా ఓటీటీ ఒప్పందాలు కుదరడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో, ‘D56’ ముందుగానే రికార్డు స్థాయి డీల్ సాధించడం విశేషంగా మారింది. ఈ డీల్‌తో ధనుష్ తన మార్కెట్ స్థాయిని మరోసారి నిరూపించుకున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. కథానాయిక విషయంలో ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా, సాయి పల్లవి, రుక్మిణి వసంత్, సారా అర్జున్ పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!