

మాస్ మహారాజా రవితేజ కుటుంబానికి చెందిన మాధవ్ భూపతిరాజు ‘మారెమ్మ’ చిత్రంతో టాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ రూరల్ యాక్షన్ డ్రామా, తెలంగాణ గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలు మరియు గ్రామ దేవతలపై ప్రజల నమ్మకాల నేపథ్యంలో రూపొందింది. మంచాల నాగరాజు దర్శకత్వం వహిస్తుండగా, మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై మయూర్ రెడ్డి బంగారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించాయి.
గణేష్ చతుర్థి సందర్భంగా సెప్టెంబర్ 10న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. రక్తం, నమ్మకం, త్యాగం వంటి అంశాలతో కూడిన ఈ కథ ప్రేక్షకులను భావోద్వేగ ప్రయాణంలోకి తీసుకెళ్తుందని మేకర్స్ తెలిపారు. పోస్టర్లలో మాధవ్ రగ్డ్ లుక్, తీవ్ర భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తుండగా, దీపా బాలు హీరోయిన్‌గా నటిస్తున్నారు. వినోద్ కుమార్, వికాస్ వశిష్ట, రూపాలక్ష్మి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!