

ఒకప్పుడు టాలీవుడ్‌లో గ్లామరస్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న నటి నమిత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. వివాహం తర్వాత ఇద్దరు పిల్లలకు తల్లైన ఆమె తాజా ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్ తొలి రోజుల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అప్పట్లో తాను ఇతరులను తక్కువగా చూసేదాన్నని, ఎవరినీ పెద్దగా పట్టించుకునేదాన్ని కాదని నమిత తెలిపారు. తన ప్రవర్తన వల్ల చుట్టుపక్కలవారు, షూటింగ్ సెట్స్‌లో పనిచేసే సిబ్బంది ఇబ్బందులు పడేవారని చెప్పారు.
తన నడవడికలో అహంకారం ఎక్కువగా ఉందని, దాన్ని మార్చుకోవాలని పలువురు నేరుగా సూచించారని నమిత పేర్కొన్నారు. ఇదే వైఖరిని కొనసాగిస్తే సినీ పరిశ్రమలో ఎక్కువ కాలం కొనసాగలేనని, కెరీర్ కూడా ముగిసిపోతుందని కొందరు హెచ్చరించినట్లు చెప్పారు. పలువురి సూచనల తర్వాతే తాను చేస్తున్న తప్పును గుర్తించి, క్రమంగా తన ప్రవర్తనను మార్చుకున్నానని తెలిపారు. గతంలో చేసిన తప్పులను నమిత స్వయంగా వెల్లడించడంతో ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!