

చిత్ర పరిశ్రమలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అనుపమ పరమేశ్వరన్, తన గత ప్రేమ జీవితానికి సంబంధించిన చేదు అనుభవాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మాజీ ప్రియుడి ప్రవర్తన కారణంగా తాను తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని చెప్పారు. మహిళలకు సహజంగా జరిగే పీరియడ్స్‌ను కూడా అతడు చులకనగా చూసేవాడని, తాను ఏదైనా విషయంలో అతడిని ప్రశ్నిస్తే తన భావోద్వేగాలను పీరియడ్స్, మూడ్ స్వింగ్స్‌కు ముడిపెట్టి కొట్టిపారేసేవాడని అనుపమ తెలిపారు. ఆ వ్యాఖ్యలు తనపై తీవ్ర ప్రభావం చూపాయని, ఒక మహిళగా పుట్టినందుకే ఇలాంటి మాటలు వినాల్సి వస్తోందా అనే బాధ కలిగేదని చెప్పారు.
ఆ విషపూరితమైన సంబంధం తన జీవితంపై, భవిష్యత్తు ఆలోచనలపై కూడా తీవ్ర ప్రభావం చూపిందని అనుపమ వెల్లడించారు. చిన్నప్పటి నుంచి 11 మంది పిల్లలు ఉండాలని కలలు కనేదాన్నని, అయితే ఆ వ్యక్తితో సుమారు రెండేళ్ల సంబంధం తర్వాత భవిష్యత్తులో పిల్లలే వద్దనే స్థాయికి తన ఆలోచనలు మారిపోయాయని తెలిపారు. అతడి ప్రవర్తన కారణంగా తాను తీవ్రమైన డిప్రెషన్‌కు గురయ్యానని, ఆ చేదు జ్ఞాపకాల నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టిందని పేర్కొన్నారు. అనుపమ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!