

సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన భారీ అంచనాల చిత్రం ‘జైలర్ 2’ రేపు థియేటర్లలో విడుదల కానుంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. విడుదలకు ముందు అనిరుధ్ రజినీకాంత్‌కు అంకితంగా భావోద్వేగపూరితమైన పోస్టును పంచుకున్నారు. తరతరాల అభిమానులకు రజినీకాంత్ తన సినిమాల ద్వారా అందించిన ఆనందం, నవ్వులు, ఉత్కంఠ, జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలను ఆయన గుర్తుచేసుకున్నారు.
దశాబ్దాలుగా సినీ రంగంలో కొనసాగుతున్నప్పటికీ రజినీకాంత్ ఇప్పటికీ తనదైన మ్యాజిక్‌తో చరిత్ర సృష్టిస్తున్నారని అనిరుధ్ ప్రశంసించారు. అభిమానుల ఆశీస్సులతో మరోసారి ప్రపంచమంతా రజినీకాంత్‌పై తమకున్న ప్రేమను చాటుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తన పోస్టును “ఒక సూర్యుడు.. ఒక చంద్రుడు.. ఒక్కరే” అనే భావనను వ్యక్తం చేసే “One Sun. One Moon. And One” అనే మాటలతో, మూడు ఫైర్ ఎమోజీలతో ముగించారు. రేపు సినిమా విడుదల కానుండటంతో బాక్సాఫీస్ వద్ద తొలి రోజు వసూళ్లపై ఆసక్తి నెలకొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!