

రజనీకాంత్ నటిస్తున్న ‘జైలర్ 2’ సినిమా అక్టోబర్ 15న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ప్రకటించిన విడుదల తేదీని చిత్రబృందం తాజాగా మరో పోస్టర్ ద్వారా మరోసారి ధృవీకరించింది. తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని చెబుతున్న కొన్ని డైలాగులను తొలగించి రీషూట్ చేస్తున్నారని, దీంతో సినిమా అనుకున్న తేదీకి విడుదల కాకపోవచ్చంటూ సోషల్ మీడియాలో పుకార్లు ప్రచారం అయ్యాయి. ఈ వార్తలపై నిర్మాణ సంస్థ స్పందించి విడుదల తేదీపై స్పష్టత ఇచ్చింది. ఇప్పటికే పూర్ణతో చిత్రీకరించిన ప్రత్యేక పాటను కూడా విడుదల చేయగా.. సినిమా విడుదలకు దగ్గరగా ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసే అవకాశం ఉంది.

2023లో విడుదలైన ‘జైలర్’ భారీ విజయాన్ని అందుకుని రజనీకాంత్ కెరీర్‌లో కీలక కమ్‌బ్యాక్ చిత్రంగా నిలిచింది. తెలుగులోనూ ఈ సినిమాకు మంచి స్పందన లభించింది. దీంతో సీక్వెల్ ‘జైలర్ 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తొలి భాగంలోని పలువురు నటీనటులు కూడా కనిపించనున్నారు. దసరా సీజన్‌లో సినిమా విడుదల కానుండటంతో బాక్సాఫీస్ పోటీ ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. ఇదే సమయంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘రణబలి’, వెంకటేష్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ చిత్రాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!