

సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన జైలర్ ఎలాంటి సంచలన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస పరాజయాల తర్వాత రజినీకాంత్‌కు ఈ సినిమా సాలిడ్ కమ్‌బ్యాక్ ఇచ్చింది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా జైలర్ 2 తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ఇప్పటికే విడుదలైన అప్‌డేట్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. అక్టోబర్ 15న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ గతంలో అధికారికంగా ప్రకటించారు.
అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల జైలర్ 2 విడుదల వాయిదా పడవచ్చంటూ ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అక్టోబర్ 15న సినిమా విడుదల కావడం కష్టమేనంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో చిత్రబృందానికి చెందిన వర్గాలు స్పందిస్తూ, విడుదల వాయిదా వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపినట్లు సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, అక్టోబర్ 15న ప్రేక్షకులకు భారీ థియేట్రికల్ అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతున్నామని పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో రజినీకాంత్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!