

విజయ్ నటించిన ‘జన నాయగన్’ జూలై 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతుండగా, అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే భారీ స్పందన అందుకుంటోంది. తమిళనాడులో టికెట్ బుకింగ్స్ ఇంకా ప్రారంభం కాకముందే బెంగళూరులోని కొన్ని థియేటర్లలో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అక్కడ ఫస్ట్ డే ఫస్ట్ షో, ముఖ్యంగా ఉదయం 6 గంటల షో టికెట్లు నిమిషాల్లోనే అమ్ముడయ్యాయి. ఇది తమిళనాడుకు వెలుపల కూడా విజయ్‌కు ఉన్న భారీ అభిమాన వర్గాన్ని మరోసారి నిరూపిస్తోంది. అయితే బెంగళూరులోని ప్రముఖ విక్టరీ సినిమా థియేటర్ ఆర్థిక విభేదాల కారణంగా సినిమాను ప్రదర్శించకూడదని నిర్ణయించినట్లు సమాచారం.
‘జన నాయగన్’ ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా దేశాల్లో 7,000 నుంచి 8,000 స్క్రీన్‌లలో విడుదల కానుండటంతో, ఇది ‘పుష్ప 2’, ‘జవాన్’ వంటి భారీ రిలీజ్‌ల సరసన నిలిచింది. ప్రస్తుతం ప్రీ-సేల్స్ రూ.4 కోట్ల మార్క్‌ను దాటినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. జూలై 19 నుంచి తమిళనాడులో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానుండగా, భారీ స్పందన వచ్చే అవకాశం ఉంది. సెన్సార్ ప్రక్రియలో ఆలస్యం జరిగినప్పటికీ అవసరమైన మార్పుల తర్వాత చిత్రానికి చివరకు ‘A’ సర్టిఫికేట్ లభించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!