

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన ‘జననాయగన్’ చిత్రం విడుదలకు ముందే భారీ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. జూలై 23న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే పరిమిత స్థాయిలో ప్రారంభమైన అడ్వాన్స్ బుకింగ్‌లకు విశేష స్పందన లభించగా, నేటి నుంచి దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో టికెట్ బుకింగ్‌లు ప్రారంభమవుతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.
పరిమిత బుకింగ్‌ల దశలోనే బుక్‌మైషోలో ఒక్కరోజులో 40 వేలకుపైగా టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం. దేశవ్యాప్తంగా బుకింగ్‌లు ప్రారంభమవడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ నటించిన తొలి థియేటర్ విడుదల కావడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!