

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ వరుస సినిమాలతో బిజీగా ఉంటూ మరో ఆసక్తికర ప్రాజెక్ట్‌లో నటించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ‘పగ్లైట్’ చిత్రంతో గుర్తింపు పొందిన దర్శకుడు ఉమేష్ బిష్త్ తెరకెక్కించనున్న ఈ రొమాంటిక్ థ్రిల్లర్‌లో జాన్వీతో పాటు టాలీవుడ్ నటి శ్రీలీల, యువ నటుడు సిద్ధార్థ్ గుప్తా కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్, దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాతలు ఏక్తా కపూర్, ఆస్కార్ విజేత గునీత్ మోంగా కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నట్లు సమాచారం.
ఈ చిత్రానికి సంబంధించిన తొలి చిత్రీకరణ షెడ్యూల్ ఉత్తరాఖండ్‌లోని నైనితాల్‌లో ప్రారంభమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఒకే వ్యక్తిపై ఇద్దరు మహిళలు తీవ్ర ప్రేమ, మోహం పెంచుకోవడం చుట్టూ కథ సాగనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జాన్వీ కపూర్ పాత్రకు నటనాపరంగా ప్రాధాన్యం ఉండనుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, సినిమా కథాంశం, నటీనటుల పాత్రలు, చిత్రీకరణ వివరాలపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!