

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఆమె, ‘చందమామ’, ‘మగధీర’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. అనంతరం తమిళం, హిందీ సహా పలు భాషల్లో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. పెళ్లి, మాతృత్వం తర్వాత కాజల్ తన సినిమా ఎంపికల్లో మార్పు తీసుకొచ్చారు. గ్లామర్ పాత్రలకంటే కథలో ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌ను కొనసాగిస్తున్నారు.
ప్రస్తుతం ‘ది ఇండియా స్టోరీ’ సినిమాలో కీలక పాత్రలో నటించిన కాజల్, సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ చిత్రంలో తన పాత్ర ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని, ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందని తెలిపారు. గతంలో ఏడాదికి ఎనిమిది, తొమ్మిది సినిమాలు చేసినప్పటికీ, ప్రస్తుతం సంవత్సరానికి రెండు లేదా మూడు సినిమాలు చేసినా మంచి కథలు, బలమైన పాత్రలకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. బాలకృష్ణతో చేస్తున్న సినిమాలో కూడా తన పాత్రకు మంచి ప్రాధాన్యత ఉందని కాజల్ వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!