

దక్షిణ భారత సినీ పరిశ్రమలో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థల్లో కెవిన్ ప్రొడక్షన్స్ ఒకటి. ఈ సంస్థ నిర్మించిన తలపతి విజయ్ చిత్రం 'జన నాయగన్' తొలుత సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా, సెన్సార్ ప్రక్రియలో జాప్యం కారణంగా వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని 'A' సర్టిఫికెట్ పొందింది. దీంతో చిత్రాన్ని జూలై 24న విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు.
ఇదే సంస్థ యశ్ హీరోగా తెరకెక్కిస్తున్న 'టాక్సిక్' చిత్రాన్ని కూడా నిర్మిస్తోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఇప్పుడు ఆగస్టు 26న విడుదల కానుంది. విడుదలైన ప్రచార చిత్రాలను బట్టి ఇందులో భారీ యాక్షన్, హింసాత్మక సన్నివేశాలు, రొమాంటిక్ అంశాలు ఎక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ చిత్రానికీ 'A' సర్టిఫికెట్ వచ్చే అవకాశాలున్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అధికారిక సెన్సార్ నిర్ణయం కోసం వేచి చూడాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!