

వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'కొరియన్ కనకరాజు' టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ క్రాస్ కల్చరల్ హారర్ కామెడీ చిత్రం ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాయలసీమ నేపథ్యంలో కొరియన్ సంస్కృతి అంశాలను మేళవించిన కథతో రూపొందుతున్న ఈ చిత్రం వినోదంతో పాటు కొత్త అనుభూతిని అందించనున్నట్లు టీజర్‌లో కనిపిస్తోంది.
ప్రభాస్ చేతుల మీదుగా విడుదలైన ఈ టీజర్‌లో వరుణ్ తేజ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నారు. ఒకవైపు రాయలసీమ యువకుడిగా, మరోవైపు కొరియన్ గ్యాంగ్‌స్టర్‌గా ఆయన నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సత్య తన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పంచనున్నట్లు టీజర్ సూచించగా, థమన్ అందించిన నేపథ్య సంగీతం హారర్ వాతావరణాన్ని మరింత బలపరిచింది. రితికా నాయక్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!