

అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన ‘లెనిన్’ సినిమా ఘన విజయాన్ని పురస్కరించుకుని చిత్రబృందం, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, అక్కినేని అభిమానులతో కలిసి ‘బ్లాక్‌బస్టర్ వైభవం’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ LLP, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూటర్లు, చిత్ర యూనిట్ సభ్యులను షీల్డ్స్‌తో సత్కరించారు.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ఈ విజయం తమ కుటుంబానికి పండగ వాతావరణాన్ని తీసుకొచ్చిందని, ప్రేక్షకులు చూపిన ప్రేమ జీవితాంతం గుర్తుండిపోతుందని అన్నారు. నాగ చైతన్య మాట్లాడుతూ అఖిల్ నటన, పాత్ర కోసం చేసిన కృషి తనకు ఎంతో గర్వకారణమని చెప్పారు. అఖిల్ అక్కినేని మూడు రోజుల్లోనే సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం ఎంతో ఆనందంగా ఉందని, ప్రేక్షకులు, అభిమానులు, డిస్ట్రిబ్యూటర్లు అందించిన మద్దతుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ, దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు కూడా ప్రేక్షకుల ఆదరణే ఈ విజయానికి కారణమని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!