

మాస్ మహారాజా రవితేజ కుటుంబం నుంచి మరో కొత్త హీరో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఆయన మేనల్లుడు మాధవ్ హీరోగా పరిచయమవుతున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘మారెమ్మ’ సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదల కానుంది. దీప బాలు కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో వికాస్, వశిష్ఠ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో పవర్‌ఫుల్ యాక్షన్, బలమైన సెంటిమెంట్, థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కుతోంది.
విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ‘మారెమ్మ’ ట్రైలర్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లోని అల్లు అర్జున్ AAA సినిమాస్‌లో ఉదయం 9 గంటలకు ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ‘మాటలకు అందని అనుబంధం.. భావోద్వేగాలకు మించిన కథ’ అనే క్యాప్షన్‌తో కొత్త పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఆకట్టుకుంటూ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!